తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు (ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధిష్టానంతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.