రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

15చూసినవారు
రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించనున్నారు. సిరిసిల్ల జిల్లాలో రేపు రూ. 345 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. సిరిసిల్ల, వేములవాడలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.99 కోట్లతో వేములవాడ రాజన్నఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్