రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

35చూసినవారు
రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్లకు శంకుస్థాపన చేసి, పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ట్యాగ్స్ :