TG: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై మంగళవారం సీఎం రేవంత్ సమీక్షించారు. హరేరామహరేకృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాలని సూచించారు. మఠాలకు, కులసంఘాలకు భూకేటాయింపులపై నిబంధనలు రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తిరుమల విధానాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే యాదగిరిగుట్టపై గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి ముందుకొచ్చే వారి జాబితా రూపొందించాలని ఆదేశించారు.