‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ అమలుపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

17చూసినవారు
‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ అమలుపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 'ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకాన్ని 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' ద్వారా అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులకు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగినే ట్రస్ట్ సీఈవోగా నియమించనున్నారు. ఈ మేరకు సోమవారం ట్రస్ట్ కమిటీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాల సేకరణ ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్