సీఎం రేవంత్ 20 ఏళ్ల రాజకీయ జీవితం సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి కష్టపడి పైకొచ్చినవారేనని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ 6 గ్యారంటీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. 'SIR' ప్రక్రియలో మజ్లిస్‌తో కుమ్మక్కై హిందువుల ఓట్లు తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.