TG: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని, కృష్ణా జలాల వాటాను 299 టీఎంసీలకు తగ్గించిన కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కృష్ణా జలాల వాటా, పంపిణీ, ఏపీతో వివాదాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రతిపక్షాల అపద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.