ఆ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ స్వీట్ వార్నింగ్

13386చూసినవారు
ఆ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ స్వీట్ వార్నింగ్
TG: హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికగా గ్రూప్‌-1 విజేతలకు సిఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2,3 కోట్లు తీసుకొని గ్రూప్‌-1 ఉద్యోగాలు అమ్ముకున్నానని నాపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. అలాగే గ్రూపు-1 ఉద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 'మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. వారిని పట్టించుకోకపోతే మీ జీతంలో 10 శాతం కట్‌ చేసి మీ పేరెంట్స్‌కు ఇస్తాం. త్వరలో చట్టం చేస్తాం’ అని సీఎం ప్రకటన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్