అనంతగిరి బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

19చూసినవారు
అనంతగిరి బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
TG: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బస్సు పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా, 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్