TG: కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందూ దేవుళ్లను అవమానించే కార్యచారణగా పెట్టుకున్నట్లుందని కిషన్ రెడ్డి విమర్శించారు. హిందూ దేవుళ్లను అవమానించే విధంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, తన వ్యాఖ్యలపై వెంటనే బేషరతుగా యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.