నేడు హైదరాబాద్ రానున్న సీఎం రేవంత్‌

22చూసినవారు
నేడు హైదరాబాద్ రానున్న సీఎం రేవంత్‌
హైదరాబాద్‌లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ప్రతికూల వాతావరణం కారణంగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. రాత్రి 9.20 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్‌ కావాల్సిన విమానం, ఏటీసీ సూచనల మేరకు పైలట్‌ బెంగళూరుకు మళ్లించడంతో అక్కడ సురక్షితంగా దిగింది. నిన్న బెంగళూరులోనే సీఎం బస చేశారు. శనివారం హైదరాబాద్‌ రానున్నారు.

సంబంధిత పోస్ట్