TG: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(FCDA) భవన నిర్మాణానికి పునాదిరాయి వేస్తారు. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్–1 నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. మొదటి దశలో 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టనున్నారు.