TG: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ముంబై వెళ్లనున్నట్లు సమాచాారం.కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవరాలి పెళ్లికి హాజరు అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సీఎం పర్యటనపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలమైన రాష్ట్రాన్ని గాలికి వదిలేసి పెళ్లిళ్లు..పేరంటాలకు తిరుగుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.