TG: గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించాం. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు నా అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నాను' అని అన్నారు.