తన హోం టౌన్ వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం రావడంపై దర్శకుడు సందీప్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు విమానాశ్రయానికి రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA) లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA) అని పేర్లు సూచించారు. వరంగల్ వారసత్వాన్ని, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించేలా పేర్లు పెట్టాలని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయాన్ని సాకారం చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.