కార్మికుల కనీస వేతనాలు ఫిక్స్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అబద్ధమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఒక కేటగిరీకి రూ.20,000 వేతనం ఉండాలని లేఖ రాసిన సీఎం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తక్కువ వేతనం ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రెండేళ్ల పాటు కాలయాపన చేశారని, రాజు గౌడ్ అనే డ్రైవర్ ఆత్మబలిదానం చేసుకునే వరకు ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. విలీనం పేరిట ఏ కేడర్ ఇస్తారు, ఎంత జీతం, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే అంశాలపై స్పష్టత లేదని కవిత పేర్కొన్నారు.