తమిళనాడు సీఎం విజయ్ వ్యక్తిగత జీవితంపై తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగం బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ వార్తలు గుసగుసలుగా వినిపిస్తున్నాయి. గతంలోనూ విజయ్ వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఎన్నికలకు ముందు సంగీత, విజయ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని, విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై ప్రచారం జరుగుతోంది.