మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. తన నివాసంలో మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం, రాతి పనులు, రహదారులు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ దారులు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు జరగాలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.