సూర్యాపేట జిల్లా పోలీసులు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అక్రమాల కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్ ఆఫీస్ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ప్రైవేట్ పీఏ ఓంకార్ మరికొందరితో కలిసి 2023 కంటే ముందు మంజూరైన రూ.34,58,400 విలువైన 51 చెక్కులను పక్కదారి పట్టించారు. వీరి వద్ద నుంచి రూ.7.30 లక్షలు, 44 చెక్కులు, ఆరు బ్యాంక్ పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.