AP: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తాటిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య బుదేరాలో టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా పాము కారు కిందకు వెళ్లింది. జనం అలికిడితో కంగారుపడి ఇంజిన్‌లోకి దూరింది. ఎంత శబ్దం చేసినా, కారు స్టార్ట్ చేసినా అది బయటకు రాలేదు. పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న సద్దాం అనే వ్యక్తి దాదాపు గంటపాటు శ్రమించి దాన్ని బయటకు తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.