ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కేతన్ హత్య కేసు.. ఖాటూ శ్యామ్ ఆలయంలో పెళ్లి చేసుకున్న సియా, చేతన్‌!
Jul 16, 2026, 09:07 IST/

కేతన్ హత్య కేసు.. ఖాటూ శ్యామ్ ఆలయంలో పెళ్లి చేసుకున్న సియా, చేతన్‌!

Jul 16, 2026, 09:07 IST
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వారికి విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు తాము రాజస్థాన్‌లోని 'ఖాటూ శ్యామ్ ఆలయం'లో రహస్యంగా వివాహం చేసుకున్నామని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూణె పోలీసుల బృందం అక్కడకు వెళ్లి ఆలయ యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే అక్కడ ఎలాంటి సీసీటీవీ ఆధారాలు లభించలేదని సమాచారం.