
రేపు 'గోదారి గట్టుపైన' ప్రీమియర్స్ షోలు
కుర్ర హీరో సమంత్ ప్రభాస్, గోదారి గట్టుపైన సినిమాతో మే 8న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ షోలు వేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలకు మంచి స్పందన వస్తోంది. సమ్మర్ సీజన్‌ను వాడుకుంటూ, స్వచ్ఛమైన తెలుగింటి పల్లెటూరి కథతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పల్లెటూరి కథలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో, ఈ సినిమా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.




