దేశంలోని మధ్య, వాయవ్య భారతంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తెలంగాణ, కర్ణాటక, MH, గుజరాత్, MP, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఒడిశాలోని అధిక ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంటుంది. ఏపీతోపాటు TM, హిమాచల్ ప్రదేశ్, PB, హరియాణా, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని IMD పేర్కొంది. దీనికి వాతావరణ మార్పులే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.