దేశవ్యాప్తంగా వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. రాబోయే వారం రోజుల్లో వాయవ్య, సెంట్రల్ ఇండియాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సెంట్రల్, వెస్ట్ ఇండియాలో వచ్చే 48 గంటల్లో 2-3 డిగ్రీలు, ఈస్ట్ ఇండియాలో వచ్చే 3 రోజుల్లో 3-4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD సూచించింది.