మధ్యప్రదేశ్‌లోని ఆగర్ మాల్వా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి ట్రేడర్స్ అనే కిరాణా దుకాణంలో పనిచేసే 45 ఏళ్ల రఫీక్ ఖాన్కు పని చేస్తుండగా గుండెపోటు వచ్చింది. కానీ, దుకాణ యజమాని సహాయం చేయకుండా, కొంత దూరంలో కూర్చొని మొబైల్ చూస్తూ ఉండిపోయాడు. సుమారు ఆరు నిమిషాల పాటు రఫీక్ నరకయాతన అనుభవించినా ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.