TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి బంద్ ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. దసరాకు ముందే రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి రూ.300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని తెలిపాయి. మిగతా రూ.900 కోట్లు చెల్లించేవరకు కాలేజీలు తెరవబోమని తేల్చి చెప్పాయి. ఈ నెల 6న లక్షన్నర మందితో HYDలో సభ నిర్వహిస్తామని చెప్పింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.