రేపు కాలేజీలు బంద్!

11చూసినవారు
రేపు కాలేజీలు బంద్!
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రేపు(జూన్ 30) తెలంగాణవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పథకాన్ని ఎత్తివేయాలని రాష్ట్రప్రభుత్వం చూస్తోందని ఎంపీ ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. రేపు కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.100 కోట్లు విడుదల చేయగా.. రేపు కళాశాలల్లో బంద్‌ ప్రభావం ఉంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

ట్యాగ్స్ :