మటన్ కొనేటప్పుడు దాని రంగును బట్టి నాణ్యతను గుర్తించవచ్చు. లేత గులాబీ, లేత ఎరుపు రంగులో ఉన్న మాంసం తాజాది, ముదురు ఎరుపు, పసుపు, గోధుమ రంగులో ఉంటే నిల్వ ఉంచినది. మేక మాంసం గొర్రె మాంసం కంటే ఆరోగ్యకరమైనది, ఇందులో కొవ్వు తక్కువగా ఉండి ఐరన్, విటమిన్ బి12, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు మేక మటన్ మంచిది. వంటకాన్ని బట్టి మెడ, చెస్ట్, వీపు, తొడ భాగాలను ఎంచుకోవాలి.