TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కొక్కరిపై రూ.4 లక్షల అప్పు మోపారని దుయ్యబట్టారు. 10 ఏళ్ల పాటు బుల్డోజర్ పాలన చేసింది బీఆర్ఎస్సేనని అన్నారు. బుధవారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన జూపల్లి.. అధికారులను తాను బెదిరిస్తున్నాననే ఆరోపణలను ఆయన ఖండించారు. మంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నానని చెప్పారు. తన గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‍కు లేదని అన్నారు. కావాలంటే తాను చర్చకు సిద్ధమని, దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.