
ఆస్తి కోసం తల్లిని గొంతు నులుమి చంపిన కొడుకు
యూపీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశాడు. కౌశింబి జిల్లాలోని ఖేర్వా గ్రామంలో షీలా దేవి(55) అనే మహిళ తన బంధువుల ఇంట్లో ఉంటోంది. అక్టోబర్ 9న ఆ ఇంట్లో ఆమె సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా.. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు ఆ రిపోర్టులో తేలింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా షీలా దేవి కొడుకు కిషన్ కిషోర్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది.




