
అమెరికా భారీ విమానం మిస్సింగ్
పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తుండగా అమెరికాకు చెందిన బోయింగ్ KC-135 స్ట్రాటో విమానం అదృశ్యమైంది. అత్యవసర పరిస్థితిని సూచిస్తూ '7700' అనే ప్రమాద సంకేతాన్ని జారీ చేసినట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి బయల్దేరి ఖతార్ మీదుగా వెళ్తుండగా విమానం సంకేతాలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




