సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు

0చూసినవారు
సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు
TG: ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి సినిమా టికెట్ రేట్లను శాసిస్తూ, కమీషన్ల రూపంలో కోట్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 'ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన' అంటూ సీఎం రేవంత్, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్