సినీ కార్మికుల సమస్యలపై కమిటీ.. చైర్మన్‌గా దాన కిశోర్

9245చూసినవారు
సినీ కార్మికుల సమస్యలపై కమిటీ.. చైర్మన్‌గా దాన కిశోర్
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదివారం జీవో 395 జారీ చేశారు. ఈ కమిటీకి కార్మిక శాఖ కమిషనర్ దాన కిశోర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో దిల్ రాజు, దామోదర ప్రసాద్, యార్లగడ్డ సుప్రియ, అనిల్ కుమార్, అమ్మిరాజు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దసరా తర్వాత కమిటీ తొలి సమావేశం కానుంది.

సంబంధిత పోస్ట్