
భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి
ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృత చెందగా.. ముగ్గురు పోలీసులు వీరమరణం పొందారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.




