TG: పార్కులు, రహదారులు, చెరువులు.. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా విషయంలో ఫిర్యాదు చేయడానికి సామాన్యులు కూడా వెనుకాడడంలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం హైడ్రా ప్రజావాణిలో మొత్తం 36 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. పార్కు స్థల కబ్జా, చెరువుల్లోకి మురుగు నీరు చేరడంతో తమ నివాసాలు ముంపునకు గురవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదులను రంగనాథ్ పరిశీలించారు.