పిల్లలను తండ్రులతో పోల్చడం సరికాదు: సెహ్వాగ్‌

6896చూసినవారు
పిల్లలను తండ్రులతో పోల్చడం సరికాదు: సెహ్వాగ్‌
తన కొడుకు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ భారత అండర్‌-19 జట్టు తరఫున అరంగేట్రం చేసిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేందర్‌ సెహ్వాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కీర్తిప్రఖ్యాతుల ప్రభావం పిల్లలపై పడకూడదని, వారిని సమకాలీకులతో పోల్చడమే సరైనదని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడిని తనతో పోల్చడం అన్యాయమని, అలాగే సచిన్‌ టెండుల్కర్‌ను ఆయన కుమారుడు అర్జున్‌తో పోల్చడం కూడా సరికాదని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. పిల్లలను స్వేచ్ఛగా ఆడనివ్వాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్