అర్హులకే కారుణ్య నియామకాలు: డిప్యూటీ సీఎం భట్టి

17చూసినవారు
అర్హులకే కారుణ్య నియామకాలు: డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును వెంటనే పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్యాన్ని ఆదేశించారు. అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ నెల 13న మంచిర్యాలలో 335 మంది వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు అత్యధికంగా లాభాల వాటా చెల్లించామని, కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ పంపిణీ చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్