TG: కొండగట్టు అగ్నిప్రమాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అంటూ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు వెంటనే 108కు సమాచారం ఇవ్వగా జగిత్యాల నుంచి వెళ్లిన రెండు ఫైర్ ఇంజిన్లు మధ్యలోనే ఆగిపోయాయని.. దాంతో కరీంనగర్ నుంచి ఫైర్ ఇంజిన్లను పిలిపించుకోవాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు రూ.5 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా కలెక్టర్ సత్యప్రసాద్‌ను ఆదేశించాలని కోరారు.