నక్సలిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. తదుపరి డీజీపీలు, ఐజీపీల సదస్సు నాటికి దేశం ఈ సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు, జమ్మూకశ్మీర్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించిందని అన్నారు. రాయ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు.