
భారతీయులకు అమెరికా షాక్.. త్వరలో ఈబీ-1 గ్రీన్ కార్డుల జారీ నిలిపివేత
అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఈబీ-1 కేటగిరీలో కోటా సెప్టెంబర్ 30 నాటికి ముగిసిపోయే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. విపరీతమైన డిమాండ్ దీనికి ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే 'ఈబీ-2' వీసాలు నిలిచిపోగా, 'ఈబీ-3' దరఖాస్తుదారులు 12 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి వస్తోంది. భారతీయుల నుంచి భారీగా దరఖాస్తులు రావడం, అమెరికా చట్టాల ప్రకారం ప్రతి దేశానికి 7% కోటా పరిమితి ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.




