4 వారాల్లో పూర్తి చేయండి.. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు

16చూసినవారు
4 వారాల్లో పూర్తి చేయండి.. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు
తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వాన్ని 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. గత ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గతేడాది డీజీపీగా బి.శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్