TG: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లోని కొన్ని విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష తప్పనిసరి చేసింది. ఇందులో జూ. అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూ. స్టెనోగ్రాఫర్లు, U.D. టైపిస్టులు, టైపిస్టులు, L.D. టైపిస్టులు మొదలైన కేటగిరీల వారున్నారు. కంప్యూటర్ పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఆఫీసు ఆటో మెషిన్ ప్రావీణ్యం కూడా కలిగి ఉండాలని తెలిపింది. ఇందుకు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని G.O.237 జారీ చేసింది.