ప్రయాణికుడిని దారుణంగా కొట్టిన కండక్టర్(వీడియో)

0చూసినవారు
రాజస్థాన్ లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడిని బస్సు కండక్టర్ దారుణంగా కొట్టాడు. భరత్పూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న బస్సు ఎక్కిన వ్యక్తి టికెట్ కోసం రూ.500 ఇచ్చాడు. టికెట్ డబ్బులు రూ.64 తీసుకుని మిగిలిన మొత్తం ఇవ్వలని ప్రయాణికుడు అడగగా కండక్టర్ విచక్షణారహితంగా కొట్టాడు. ప్రయాణికుడిపై దాడిని డ్రైవర్ కూడా ప్రోత్సహించాడు. మిగతా ప్రయాణికులు వారిస్తున్నా వినలేదు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్