కండక్టర్ ప్రవళిక మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

11చూసినవారు
కండక్టర్ ప్రవళిక మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు డిపో బస్సులో చిల్లర విషయంలో జరిగిన గొడవలో ప్రయాణికురాలు తోసేయడంతో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్