
పిడుగుపడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి
TG: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి సమీపంలో ఏఆర్ కానిస్టేబుల్ సుద్దమోని రాజు(35) పిడుగుపాటుతో మృతి చెందారు. సీఎం బందోబస్తుకు వెళ్లి సొంత గ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో, మార్గమధ్యంలో కారు ఆపి మలవిసర్జనకు వెళ్లగా అకస్మాత్తుగా పిడుగుపడటంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. రాజుకు భార్య సువర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.




