తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, నేరెళ్ల బాధితులను
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసి దగా చేస్తున్నాయని ఆరోపించారు. వారి దుఃఖాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు వారు బాధితులు అనడానికి ఆధారాలు లేవని అనడం సిగ్గుచేటని అన్నారు. సిరిసిల్ల సభలో బాధితులకు రూ.10, రూ.5 లక్షల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, బీఆర్ఎస్ పాలనలో హింసిస్తే,
కాంగ్రెస్ హయాంలోనూ అన్యాయమే జరుగుతోందని విమర్శించారు.