
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. సెయింట్ లూయిస్‌లో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆమె రాత్రి రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే కారును ట్రక్ ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు.




