దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కిషన్‌రెడ్డి

75చూసినవారు
దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కిషన్‌రెడ్డి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సన్న బియ్యం పేరుతో రైతులు, పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళారులు, రైస్ మిల్లర్ల చేతిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణలో పండే నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయించి, తక్కువ నాణ్యత గల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను పూర్తిగా సాధించలేదని, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై వ్యవహరిస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్