ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jul 05, 2026, 10:07 IST/

ముంబైలో భారీ వర్షాలు.. ముకేశ్‌ అంబానీ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం

Jul 05, 2026, 10:07 IST
భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బీఎంసీ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలో అక్కడ కురుస్తున్న వర్షాలకు ముకేశ్ అంబానీ భద్రతా కాన్వాయ్‌ ఎదుట ఓ భారీ వృక్షం కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అధికారులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.