TG: ఎల్‌నినో వస్తోందని ఎప్పటి నుంచో హెచ్చరించినా, పరిస్థితిని ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు.
కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా కరెంటు ఆగలేదని ఆయన అన్నారు. బొగ్గు లేదని తాను గతం నుంచే హెచ్చరిస్తున్నానని హరీశ్ తెలిపారు. ఇప్పుడు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే బొగ్గు లేదని సాకు చెబుతున్నారని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరోనా కంటే డేంజర్ అని ఆయన విమర్శించారు. వర్షాకాలంలోనూ రేవంత్‌రెడ్డికి కరెంట్ ఇవ్వడం చేతకావట్లేదని విమర్శించారు.